Chorus
క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు మంగళం క్రీస్తుయేసే దైవమంచును
కూడి పాడుదు మంగళం
Verse
ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు
మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం‖ క్రీస్తు ‖
Verse
జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష అగణీ తంబగు
ప్రేమజూపిన అమరతేజుడ మంగళం‖ క్రీస్తు ‖
Verse
ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము కలుషమును
కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం‖ క్రీస్తు ‖
Verse
మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ అనయము
నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం‖ క్రీస్తు ‖
Verse
జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ
పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం‖ క్రీస్తు ‖