Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kristhese Mana Mahima Nirikshanayai Yunnadu

క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు

Kristhese Mana Mahima Nirikshanayai Yunnadu

Verse 1
Reference: మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడు కొలొస్స Colossians 1:27
Chorus
క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు
ఆ నిరీక్షణ పరలోకమందు
మన కొరకై ఉంచబడి యున్నది
Verse
సంపూర్ణము చేయబడిన - సిలువ కార్యమునందు
విశ్వాసము ద్వార మనలను - ఆయనే ఆయన యందు
నిరీక్షించు నటుల జేసెను
Verse
సూర్యచంద్రుల కాంతి - తేజోహీనమై పోగా
నక్షత్రముల కాంతియును - తరిగిపోయిన దినము
తానే నిరీక్షణ యగును
Verse
అన్యుడెవడును సీయోను నందు - వాసము చేయగలేడు
పరిశుద్ధ శిఖరమందున్న - దేవుడెహోవ యనియు
పరికించు నటుల జేసెను
Verse
తుదమట్టుకు నిరీక్షణను - మనముంచిన యెడల
మందిర మందుండి పారుచు - ఉబికెడి ఊటగనుండి
నిరీక్షించు తన రాకడను

Related Tags

FaithHopeGloryChrist