Chorus
క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున
యెవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది
Verse
అపొస్తలుల బోధను నమ్మి - స్థిరపరచ బడిన వారే
ఆత్మశక్తితో వారు యెల్లప్పుడు - సంఘములో నిలిచెదరు
Verse
పరశుధ్ధులతో సహవాసమును - ఎవరు కలిగియుందురో
వారె పొందెదరు క్షేమాభివృధ్ధి - క్రీస్తేసు ప్రభువు నందు
Verse
ప్రభుదేహరక్తమును తినిత్రాగువారే - తనయందు నిలిచెదరు
ప్రకటించెదరు ఆయన మరణ - పునరుత్థానమును వారు
Verse
పట్టువదలక సంఘముతో కూడి - ఎవరు ప్రార్థించెదరో
ప్రార్థన ద్వారా సాతాను క్రియలు - బంధించెదరు వారే
Verse
క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు - ఎవరెదురు చూచెదరో
నిత్యానందముతో సాక్షమిచ్చెదరు - సర్వలోకమునందు