Verse
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు
క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ
తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ‖ క్రొత్త ‖
Verse
పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర
డెందమందు స్మరణ జేయుడి
ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు
అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా‖ క్రొత్త ‖
Verse
బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు
కలిమి మీర గర్త వాక్కున
అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది
బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ‖ క్రొత్త ‖
Verse
పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు
ప్రాపు జేరి మీరు వేడగా
సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి
పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు‖ క్రొత్త ‖