Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krotha Yedu Modalu Bettenu Mana Brathuku Nandu Krotha Yedu

క్రొత్త యెడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు క్రొత్త యెడు

Krotha Yedu Modalu Bettenu Mana Brathuku Nandu Krotha Yedu

Chorus
క్రొత్త యెడు మొదలు బెట్టెను - మన బ్రతుకు నందు - క్రొత్త యెడు
మొదలు బెట్టెను - క్రొత్త మనసుతోడ మీరు - క్రొత్త యేట ప్రభుని సేవ
దత్తరపడకుండజేయు - టుత్తమోత్తమంబు జూడ
Verse
పొంది యున్న మేలులన్నియు - బొంకంబుమీఱ - డెందమందు
స్మరణజేయుచు యిందు మీరు మొదలుబెట్టు - పందెమందు
బారవలయు నందముగను రవిని బోలి - నలయకుండ సొలయకుండ
Verse
మేలు చేయదడవొనర్చగా - మీరెఱగునట్లు కాలమంత నిరుడు
గడచెగా - ప్రాలుమాలి యుండకుండ - జాలమేల సేయవలయు
జాల జనము కిమ్మాను - యేలు నామ ఘనత కొరకు
Verse
బలములేని వారమయ్యును - బలమొందవచ్చు - గలిమి మీఱ గర్త
వాక్కున - నలయకుండ నడగుచుండ - నలగకుండ మోదమొంది
బలమొసంగు సర్వవిధుల - నెలవి మీరనర్చుచుండ
Verse
ఇద్దరిత్రి నుండునప్పుడే - ఈశ్వరుని జనులు - వృద్ధి బొంద జూడ
వలయును - బుద్ధి నీతిశుద్ధులందు - వృద్ధినొంద శ్రద్ధజేయు - శుద్దులైన
వారిలొ - బ్ర - సిద్దులగుచు వెలుగవచ్చు
Verse
పాప పంక మంటినప్పుడు - ప్రభు క్రీస్తుయేసు - ప్రాపు జేరి మీరు
వేడగా - నేపు మీఱదనదు కరుణ - బాపమంత గడిగివేసి
పాప రోగ చిహ్నాలన్ని - బాపివేసి శుద్ధిచేయు

Related Tags

DevotionalNew Year