Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kroththa Yaedu Modhalu Bettenu Mana

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన

Kroththa Yaedu Modhalu Bettenu Mana

Lyricist: Pulipaka Jagannadhamu
Verse
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ
మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు
టుత్తమోత్తమంబుఁ జూడఁ‖ క్రొత్త ‖
Verse
పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ
జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు
నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ‖ క్రొత్త ‖
Verse
మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు
గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ
జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ‖ క్రొత్త ‖
Verse
బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త
వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల
నెలమి మీ రొనర్చుచుండఁ‖ క్రొత్త ‖
Verse
ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ
వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన
వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ‖ క్రొత్త ‖
Verse
పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మీరు వేఁ
డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ
చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ‖ క్రొత్త ‖

Related Tags

PraiseDevotionalNew Year