Verse
కృప కలిగిన దేవా నా యెహోవా
కల్వరి నాధా నా యేసయ్యా
నా ప్రార్ధన అలకించుమా
నా పాప బంధాన్ని విడిపించుమా
Verse
నీ కృపతో నన్ను కాయుము ప్రభువా
నీ కృపతో నన్ను దరిచేర్చు యేసయ్య
నీ కృపతో నన్ను రక్షించు ప్రభువా
నీ కృపతో నన్ను నడిపించు యేసయ్యా
Verse
నా పూర్ణ హృదయముతో స్తుతియించెదను
నీ ఘన కార్యములు ప్రకటించెదను
నీ అద్భుతములను వివరించెదను
నీ దివ్య నామమునే కీర్తించెదను