Verse
కృప కలిగిన వాడా నీలో నిలిచెదను
దయగల యేసయ్య నీతో నడిచెదను
Chorus
నా జీవితకాలము పాటలు పాడెదను
నా బ్రతుకు దినమంతా ఆరాధించెద
Verse
నా బ్రతుకు బాటను నీ వేసావే
ఆ మంచి మార్గంలో నన్ను నిలిపావు
ఆరిన నేలకు సెలయేరువు నీవు
నా దారికి రహదారివై నా ముందున్నావు
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతుకు దినములు
Verse
చేయలేనన్న సేవకు పిలిపిచ్ఛావే
ఆ పరిచర్యకు వెలిగించావు
సన్నిధిలో సహవాసంలో నన్ను ఉంచావు
సంఘములో సేవకునిగా నను మార్చావు
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతుకు దినములు
Verse
పోయినన్న ప్రాణాన్ని తిరిగిచ్చావే
బ్రతకనన్న ఆశను బ్రతికించావు
నీవు ఇచ్చిన ఈ ఊపిరి నీకే అంకితము
నీవు ఇచ్చిన ఈ దేహము నీకే సొంతం అయ్యా
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతుకు దినములు