Verse
కృప కనికరముల
మా దేవా – కృతజ్ఞత నర్పింతు‖ 2x ‖
Verse
యెహోవా చేసిన ఉపకారములకై
ఆయనకేమి చెల్లింతును‖ 2x ‖
యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను‖ 2x ‖
రక్షణ పాత్ర చేబూని‖ కృప ‖
Verse
నీదు కృపతో నాదు యేసు
నన్ను నీవు రక్షించితివి‖ 2x ‖
కాదు నాదు – క్రియల వలన‖ 2x ‖
ఇది దేవుని వరమే‖ కృప ‖
Verse
చెప్ప నశక్యము మహిమ యుక్తము
నీవొసంగిన సంతోషము‖ 2x ‖
తప్పకుండా – హల్లెలూయా‖ 2x ‖
పాట పాడెదన్‖ కృప ‖