Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krupa Krupa Sajeevulatho

కృపా కృపా సజీవులతో

Krupa Krupa Sajeevulatho

Lyricist: Hosanna Ministries
Verse 1
కృపా కృపా సజీవులతో
నను నిలిపినది నీ కృపా
నా శ్రమదినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప
కృపాసాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా
శాశ్వతమైన నీ ప్రేమతో
నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై నే
నీ దివ్యసన్నిధిలో నన్నొదిగిపోని
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై
నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే
నీ మహిమను ప్రకటింప నను నిలిపెనే
గాలితుఫానుల అలజడిలో
గూడు చెదరిన గువ్వవలె
గమ్యమును చూపే నిను వేడుకొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి
నీ వాత్సల్యమే నవ వసంతము
నా జీవిత దినముల ఆద్యంతము
ఒక క్షణమైన విడువని ప్రేమామృతము
అత్యున్నతమైన కృపలతో
ఆత్మఫలముల సంపదతో
అతిశ్రేష్ఠమైన స్వాస్థ్యమును పొంది
నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ
నా హృదయార్పణ నిను మురిపించనీ
నీ గుణాతిశయములను కీర్తించనీ
ఈ నిరీక్షణ నాలో నెరవేరనీ

Related Tags

WorshipGraceGods Love