Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krupa Kshemamu Nee Shashvatha Jeevamu

కృపా క్షేమము నీ శాశ్వత జీవము

Krupa Kshemamu Nee Shashvatha Jeevamu

Chorus
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు‖ 2x ‖
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా
Verse
నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి‖ 2x ‖
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను‖ 2x ‖
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే‖ 2x ‖
ఆరాధన నీకే‖ కృపా క్షేమము ‖
Verse
నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి‖ 2x ‖
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను‖ 2x ‖
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే‖ 2x ‖
ఆరాధన నీకే‖ కృపా క్షేమము ‖
Verse
నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని‖ 2x ‖
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా‖ 2x ‖
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే‖ 2x ‖
ఆరాధన నీకే‖ కృపా క్షేమము ‖

Related Tags

WorshipGraceNew Year