Verse
కృపా సత్యా సంపూర్ణుడా
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా‖ 2x ‖
నా సన్మానానికే - మహనీయుడవు నీవేనయ్యా‖ 2x ‖
Verse
యెఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు - రహదారిగ మారగా‖ 2x ‖
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలముల లోనే శత్రు సైన్యము మునిగిపోయెనే‖ 2x ‖
Verse
నూతన క్రియను చేయుచున్నానని - నీవు సెలవీయ్యగా‖ 2x ‖
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారి పోయెనె‖ 2x ‖
Verse
నైవేద్యములు దహన బలులు - నీవు కోరవుగా‖ 2x ‖
నా ప్రాణాత్మ శరీరము బలి యర్పణ కాగా
నా జీహ్వ బలులు స్తోత్ర బలులుగ మారి పోయెనే‖ 2x ‖