Verse 1
కృపామయుడా నీలోన నివసింపజేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో
Verse
ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక
నా మార్గము లన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున‖ కృపా ‖
Verse
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా
రాజ వంశములో - యాజకత్వము చేసెదను‖ కృపా ‖
Verse
నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు‖ కృపా ‖
Verse
ఏ యోగ్యతా లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు
నీ కృప నను వీడక - శాశ్వత కృప గా మారెను.‖ కృప ‖