Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krupaamayudaa

కృపామయుడా

Krupaamayudaa

Lyricist: Hosanna Ministries
Verse
కృపామయుడా – నీలోనా‖ 2x ‖
నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…
Verse
ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక‖ 2x ‖
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున‖ 2x కృపామయుడా ‖
Verse
చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా‖ 2x ‖
రాజవంశములో
యాజకత్వము చేసెదను‖ 2x కృపామయుడా ‖
Verse
నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు‖ 2x ‖
నా పైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు‖ 2x కృపామయుడా ‖
Verse
ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు‖ 2x ‖
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను‖ 2x కృపామయుడా ‖

Related Tags

PraiseWorshipGrace