Chorus
కృపామయుడా నీలోన‖ 2x ‖
నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో
Verse
ఏ అపాయము నా గుడారము సమీపించనీయక
నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున‖ కృపామయుడా ‖
Verse
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా
రాజ వంశములో యాజకత్వము చేసెదను‖ కృపామయుడా ‖
Verse
నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు
నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు‖ కృపామయుడా ‖
Verse
ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు
నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను‖ కృపామయుడా ‖