Verse
కృపగల దేవా దయగల రాజా
కృపగల దేవా దయగల రాజా
చేరితి నిన్నే బహు ఘనతేగా
నీ చరణములే నే కోరితిని
నీ వరములనే నే వేడితిని‖ 2x ‖
సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా‖ 2x కృపగల ‖
Verse
త్రోవను చూపే తారవు నీవే
గమ్యము చేర్చే సారథి నీవే‖ 2x ‖
జీవన యాత్రా శుభప్రదమాయే
నా ప్రతి ప్రార్థన పరిమళమాయె
నీ ఉదయకాంతిలో నను నడుపుము
నా హృదిని నీ శాంతితో నింపుము‖ 2x కృపగల ‖
Verse
కృప చూపి నన్ను అభిషేకించి
వాగ్ధానములు నెరవేర్చినావే‖ 2x ‖
బహు వింతగా నను ప్రేమించినావే
బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంత వివరింతును
నీ దివ్య మహిమలను ప్రకటింతును‖ 2x కృపగల ‖
Verse
నా యేసురాజా వరుడైన దేవా
మేఘాల మీద దిగి వచ్చు వేళ‖ 2x ‖
ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో
ప్రియమైన సంఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో
జీవింతు నీలోనే యుగయుగములు‖ 2x కృపగల ‖