Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krupagala Devaa Dayagala Raajaa

కృపగల దేవా దయగల రాజా

Krupagala Devaa Dayagala Raajaa

Lyricist: Abraham
Verse
కృపగల దేవా దయగల రాజా
చేరితి నిన్నే బహుఘనతేజ
నీ చరణములే నే కోరితిని
నీ వరములనే నే వేడితిని
సర్వాధికారి నీవే దేవా
నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి
ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా
త్రోవను చూపే తారవు నీవే
గమ్యము చేర్చే సారధి నీవే
జీవనయాత్ర శుభప్రదమాయే
నా ప్రతి ప్రార్ధన పరిమళమాయే
నీ ఉదయకాంతిలో నను నడుపుము
నా హృదిని నీ శాంతితో నింపుము
కృప చూపి నన్ను అభిషేకించి
వాగ్ధానములు నెరవేర్చినావే
బహు వింతగా నను ప్రేమించినావే
బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంత వివరింతును
నీ దివ్య మహిమలను ప్రకటింతును
నా యేసురాజా వరుడైన దేవా
మేఘాల మీద దిగివచ్చు వేళ
ఆకాశవీధిలో కమనీయ కాంతిలో
ప్రియమైన సంఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో
జీవింతు నీలోనే యుగయుగములు

Related Tags

PraiseWorship