Verse
కృపగల దేవుని సర్వదా నుతించుఁడి
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
Verse
సర్వశక్తుఁడాయనే సర్వదా చాటించుఁడి
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును
Verse
పగటి నేలునట్లు సూర్యునిన్ సృజించెను
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
Verse
సర్వజీవకోటిని బ్రోచు దేవుఁ డెన్నఁడు
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
Verse
కర్త మనయందును కనికర ముంచెను
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
Verse
దైవ ఘన మహిమన్ జాటుచుండుఁడి యిలన్
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.