Verse
పల్లవి: కృపగల దేవుని కొనియాడెదము‖ పల్లవి ‖
కృపచాలు నీకనే ప్రభుయేసు
Verse
పాపములెన్నియో చేసినవారము‖ 1x ‖
నెపములెంచక తన ప్రాణమిడె
కృపద్వారానే రక్షించె మనల
Verse
కృపయు సత్యమును యేసు ద్వారనే‖ 2x ‖
కృపగల దేవుడు ఈ భువికి వచ్చె
కృపతోడనే గాచును మనల
Verse
సర్వకృపానిధియగు మన దేవుడు‖ 3x ‖
పరిపూర్ణత నిచ్చి బలపరచును
స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి
Verse
సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్‖ 4x ‖
సర్వకాలము ప్రభుతో నిలుచుందుము
సర్వము మీవని బోధించె
Verse
శ్రమయైనను సిలువ బాధైనము‖ 5x ‖
శ్రమనొందిన క్రీస్తు ప్రభుతో
క్రమముగా కృపచే సాగెదము
Verse
ఇక జీవించువాడను నేను కాను‖ 6x ‖
ఇక జీవించుట నా ప్రభు కొరకే
సకలంబు ప్రభున కర్పింతున్
Verse
నేనేమై యుంటినో అది ప్రభు కృపయే‖ 7x ‖
నన్ను నడిపించును ప్రభువు సదా
పెన్నుగా నేర్పును హల్లెలూయ