Verse 1
Reference: ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము 2 కొరింథీ Corinthians 6:2
Chorus
కృపకాలము దాటిపోవుచున్నది
కృపపొందను పరుగిడి రండు వేవేగ
Verse
పగలు దాటిపోయెను రాత్రి వచ్చుచున్నది
దిగులులేక యేసుని సొంతముగా చేరుడి
Verse
పాప ఆశ వీడుచు, లోకమైత్రి వీడుచు
పాపమన్నింపొందియే జీవమార్గము చేరు
Verse
సొంత క్రియలు ముందును వెనుక నంధకారము
నంతమగ్ని కొలిమియె ఇట్టి మార్గమందున
Verse
రేపు నీది యగునా మరణవేళ తెలియునా?
ప్రాపకుడు యేసుడు వచ్చు వేళ తెలియునా?
Verse
క్రీస్తు విరోధి వచ్చును నరుల మోసగించును
అంత పాప మధికమై దేవ భక్తి తగ్గును
Verse
దొంగభక్తి వీడుచు బూతుభాష విడచుచు
దండనకు తప్పుము శిక్ష రాకముందుగా
Verse
ఎన్ని మార్లు రక్షణ వార్త వినియు నమ్మక
యున్నవారు కృపకై లేచి అంగలార్తురు
Verse
వ్యాధి శ్రమలు మరణమో వేరు ఎట్టి కష్టమో
బాధించక ముందుగా నేసునొద్ద కరుగుము
Verse
నిన్ను ప్రభువు త్రోయక నరకమునకు పంపక
యుండునట్లు దైవకృప పొంద యేసును చేరు
Verse
ఆది ప్రేమ భ్రష్ఠులై అల్లలాడి జీవించు
మానవులను చూడక యేసు విభుని చూడుమా