Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krupakaalamulo Prabhuyaesuni Amgeekarimchumu O Priyudaa

కృపకాలములో ప్రభుయేసుని అంగీకరించుము ఓ ప్రియుడా

Krupakaalamulo Prabhuyaesuni Amgeekarimchumu O Priyudaa

Chorus
కృపకాలములో - ప్రభుయేసుని
అంగీకరించుము - ఓ ప్రియుడా
Verse
సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన
మిత్రుడా నీ కేమి లాభముండును (2) ఈ లాటి జీవముతో‖ 2x ‖
యేసుని ప్రేమ స్వరము విని - తెరువు నీ హృదయము
ప్రభు యేసుని చరణముల్ చేరి అనంత ముక్తి పొందు
Verse
ధర్మ కర్మ సంస్కారమువలన పరిశుద్ధుడవు కానేరవు
భక్తి వేషాలు ధరించుకొన్న (2) పరలోకము చేరవు‖ 2x ‖
కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసు నొద్ద
మహాప్రభుని చరణముల్ చేరి అర్పించుకో నిన్నే
Verse
ప్రభుయేసుక్రీస్తు నిత్యరక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో
పాపమార్గం వదలి పశ్చాత్తాపముతో (2) ప్రభుశరణము చేరి‖ 2x ‖
నీ పాపములను ప్రభురక్తమందు కడిగి శుద్ధిచేసుకో
పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు
Verse
క్రీస్తులో పూర్ణ నిత్యజీవం పరలోక ఆశీర్వాదములు
ఓ మరణమా నీ ముల్లెక్కడ (2) క్రీస్తునందు విజయమే‖ 2x ‖
శిక్ష దండన తొలగింపబడె ప్రభుయేసు క్రీస్తునందే
ప్రభు శక్తిచే పాతాళ ద్వారం సదా ఓడింపబడె

Related Tags

GraceInvitationSalvation