Verse
కృపలను తలంచుచు‖ 2x ‖
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్‖ 2x కృపలను ‖
Verse
మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను‖ 2x ‖
ముట్టునని సెలవిచ్చిన దేవుడు
కాచెను గతకాలం – (నన్ను)‖ 2x కృపలను ‖
Verse
కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో‖ 2x ‖
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం – (యేసు)‖ 2x కృపలను ‖
Verse
రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను‖ 2x ‖
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం – (ప్రభువు)‖ 2x కృపలను ‖
Verse
సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి‖ 2x ‖
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను – (ఇలలో)‖ 2x కృపలను ‖
Verse
హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే‖ 2x ‖
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే – (ఆమెన్)‖ 2x కృపలను ‖