Verse
పల్లవి:
కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్‖ 2x ‖
Verse
మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను‖ 2x ‖
ముట్టునని సెలవిచ్చిన దేవుడు - కాచెను గతకాలం నన్ను
Verse
రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను‖ 2x ‖
నాకు విరోధమై వర్ధిల్లదుయని - చెప్పిన మాట సత్యం ప్రభువు
Verse
కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో‖ 2x ‖
నింగిని చీల్చి వర్షము పంపి - నింపెను నా హృదయం! యేసు
Verse
సర్వోన్నతుడైన - నా దేవునితో చేరి‖ 2x ‖
సతతము తన కృప వెల్లడి చేయు - స్తుతులతో నింపెను యిలలో
Verse
హల్లెలూయ ఆమేన్ - ఆ..., నాకెంతొ ఆనందమే‖ 2x ‖
సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం - ఆనందమానందమే - ఆమేన్