Chorus
కృపాసింహాసనుండా - అల్ఫా ఓమేగా నీవేగా
కృపా - దాపునజేరి నుతించెద
Verse
ఇదిగో సమస్తమును
నూతనముగ చేయుచున్నాను - ఇదిగో‖ 1x ఇదిగో ‖
మోదంబు గలుగజేసెద
Verse
దైవవాక్యము గైకొని
జీవించి జయించువాని - దైవ‖ 2x దైవ ‖
దేవాలయ స్తంభముగా జేతున్
Verse
దావీదు తాళము గలిగి
నా దేవుని పేరు వ్రాసెద - దావీదు‖ 3x దావీదు ‖
జీవింపజేతున్ నెపుడచట
Verse
సత్యస్వరూపిని
నా క్రొత్త పేరు వాని పై వ్రాతున్ - సత్య‖ 4x సత్య ‖
సత్యమునందు నడిపింతున్
Verse
పరలోకమును దిగివచ్చు
పరిశుద్ధ పట్టాణము పేరు - పర‖ 5x పర ‖
మురియుచు వానిపై వ్రాతున్
Verse
ఉత్తముడు యెహోవా
క్రొత్తగీతము పోఅడుడి - ఉత్తముడు‖ 6x ఉత్తముడు ‖
పుత్రుడేసుని మన కొసగెన్
Verse
తండ్రికి ప్రియుడేసు
అండగ నుండెను తండ్రి - తండ్రికి‖ 7x తండ్రికి ‖
మెండుగ నాత్మతో నిండెన్
Verse
సిలువపై ప్రాణమిడెను
విలువ సమాధి నుంచబడె - సిలువపై‖ 8x సిలువపై ‖
గెలిచి లేచె సజీవుండై
Verse
ఘనుడైన ప్రియుడేసు
దీనుల యాదరించును - ఘను‖ 9x ఘను ‖
వినయముతో మనలను పిలిచెన్
Verse
ఉల్లంబులు రంజిల్లె
ఎల్లప్పుడు ప్రభు మనతో నుండ - ఉల్ల‖ 10x ఉల్ల ‖
హల్లెలూయ పాడెదము