Chorus
కృపాతిశయముల్ ఓ నా యెహోవా - నిత్యమున్ కీర్తింతును
తరతరములకు నీ విశ్వాస్యతన్ - తెలియ జేసెదను
Verse
యెహోవా వాక్కు దర్శనమందు - అబ్రామునకు వచ్చెను
అబ్రామా భయపడకు‖ 2x ‖
నీ కేడెమును - బహుమానము నేనై యున్నాననెను‖ 2x ‖
Verse
నా నిబంధనన్ ఏ నాటికిన్
రద్దుపరచనని పల్కెన్ - మార్చవు నీ మాటను
నీ పెదవులతో పల్కిన దానిని దృఢము చేతువు
Verse
శాశ్వతమైనదా ప్రభుత్వము - తొలగిపోదే నాటికిన్
లయము కాదు ఆ రాజ్యం
మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయెన్ నిత్యము
Verse
నీ నిబంధనన్ దావీదుతోడని లేవీయులతో జేసితివి
ఆకాశ తారల వలెన్
సముద్ర ఇసుక రేణువులంతగ జేసెదనంటివి
Verse
దివారాత్రులతో నా నిబంధన
మార్చెదరా మీరు మీరునట్లు - అట్లయిన భంగమగున్
దావీదుతోనే జేసినయట్టి నిబంధనంటివి
Verse
సింహాసనమున దావీదు - సంతతి యుండక మానదు
లేవీయుల్ యాజకులన్
నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి
Verse
యెహోవా నీ కృప కార్యములన్నియు
వీనుల విందుగ నొప్పుచుండె
శ్లాఘింతున్ మనసారగన్
హల్లెలూయ - స్తోత్రములతో - కీర్తింతు నిత్యము