Intro
కృతజ్ఞత‖ కృతజ్ఞత ‖
ఏమి చేసి నీ రుణము తీర్తుమయ్య
Chorus
ఏమి చేసి నీ రుణము తీర్తుమయ్య.. మా యేసయ్యా..
ఏమి పాడి నిన్నారాధింతుమ్మయ్యా..
మా మెస్సయ్యా..
నీ సేవలో బ్రతికెదమ్..
నీ కీర్తిని చాటేదమ్..
నీ సాక్షిగ నిలిచెదమ్..
చాలయ్యా...‖ 2x ‖
చాలయ్యా యేసయ్యా ఇది చాలయ్యా యేసయ్యా...
చాలయ్యా యేసయ్యా , మా యేసయ్యా....
Verse
ఏ శక్తి చెప్పినది.. సూర్యునికి లేలెమ్మని..?
ఏ స్పర్శ తాకినది.. ప్రకృతికి ఏ రంగని..?
ఏ చెవున పలికినది.. ఆ గర్భమే నీదని..?
ఏ ఘనము చెసినది.. మా ధనము నీవనీ..?
ప్రతీ కార్యము.. నీ చిత్తమే.. మము హత్తుకొనుమయ్యా...
ప్రతీ స్వరములో.. నీ రూపమే.. నిను విడువబోమయ్యా...
Verse
ఆ ప్రవచన పలికినదా ఓ.. రక్షకుడే పుట్టేననీ...
వెలుగే దారి చూపినదా మన తరతరములు నడచుననీ...
ఆ బుజమే అడిగినదా.. ఈ రాజ్యభారం మోయామనీ..
తన రక్తమే రాసినదా.. ఈ వంశాలకు అధిపతనీ..
బంగారు సాంబ్రాణి.. బొలమును.. తెచ్చితిరే.. ఆ జ్ఞానులు..
అర్హతయే.. వరమువలె.. సేవలో నీవెంటే.. వెంబడించదమ్...
Outro
ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ ఆ..
ఆ ఆ.. ఆదోనాయ్...‖ 2x ‖
త్రియేక దేవ.. నీకు కృతజ్ఞతులయ్యా..
మా లోకరక్షకా.. నీకు కృతజ్ఞతులయ్యా..
మా నిమిత్తము నీ రక్తాన్ని ప్రోక్షించినందుకు కృతజ్ఞతులయ్యా..
ఏ తోడు లేని మా ఈ దీన ప్రాణములను , నీకు సాక్షిగా నిలుపుతున్నందుకు కృతజ్ఞతులయ్యా..
ఎఫ్ఫేతా.... నీకు వేలాది వందనములయ్యా.. నికే మహిమ ఘనత ప్రభావము యుగ యుగములు చెల్లునుగాక !