Verse
కృతజ్ఞతన్ తలవంచి
నాదు జీవము అర్పింతును
లేదే ఇక-నే ఈవి ఇల
అర్పింతును నన్నే నీకు‖ 2x ‖
Verse
దూరమైతి నీ ప్రేమ మరచి
నే రేపితి నీ గాయముల్‖ 2x ‖
దూరముగా నిక వెళ్ళజాల
కూర్చుండెద నీ చెంతనే‖ 2x కృతజ్ఞతన్ ‖
Verse
ఆకర్షించే లోకాశాలన్ని
లోక మహిమ నడ్డగించు‖ 2x ‖
కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై
నిక్కముగా త్యజింతును‖ 2x కృతజ్ఞతన్ ‖
Verse
తరముల నీ ప్రేమ నాకై
వర్ణింపను అశక్యము‖ 2x ‖
నిరంతరము సేవించినను
తీర్చలేను నీ ఋణము‖ 2x కృతజ్ఞతన్ ‖