Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kruthajnythan Thalavanchi Naadhu Jeevamu Arpinthunu

కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును

Kruthajnythan Thalavanchi Naadhu Jeevamu Arpinthunu

Verse
కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును
లేదే యిక నే యీవి యిల - అర్పింతును నన్నే నీకు
Verse
దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్
దూరముగ నిక వెళ్ళజాల - కూర్చుండెద నీ చెంతనే
Verse
ఆకర్షంచె లేకాశలన్ని - లోక మహిమ నడ్డగించు
కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును
Verse
తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము
నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము
Verse
లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును
నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము
Verse
చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై

Related Tags

SurrenderDevotionGratitude