Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kshanamaina Gaduvadu

క్షణమైన గడవదు

Kshanamaina Gaduvadu

Lyricist: Joshua Gariki
Verse
క్షణమైన గడవదు తండ్రి
నీ కృప లేకుండా‖ 2x ‖
ఏ ప్రాణం నిలువదు ప్రభువా
నీ దయ లేకుండా‖ 2x ‖
నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం
నీవే నా సర్వం – యేసు‖ 2x క్షణమైన ‖
Verse
ఇంత కాలం లోకంలో బ్రతికా
జీవితం అంతా వ్యర్థం చేసా
తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని
అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని‖ 2x నీవే ‖
Verse
పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా
ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా
నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా
నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా‖ 2x నీవే ‖
Verse
జ్ఞానమున్నా పదవులెన్నున్నా
ధనము ఉన్నా సర్వం నాకున్నా
నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా
పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా‖ 2x నీవే ‖

Related Tags

PraiseWorshipGrace