Verse
క్షణమైన నీవు నను విడచి పోలేదుగా
కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా‖ 2x ‖
కునుకక నిదురించక
కనుపాపలా నను కాచియుంటివి‖ 2x క్షణమైన ‖
Verse
పర్వతములు అన్ని తొలగిపోయినా
నాదు మెట్టలన్ని చెదరిపోయినా‖ 2x ‖
నా వెన్నంటి నా తట్టు నిలచి
కన్నీటినంతా తొలగించితివి‖ 2x ‖
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు‖ 2x క్షణమైన ‖
Verse
శోధనలు నన్ను చుట్టుముట్టినా
శ్రమలే నన్ను కృంగదీసినా‖ 2x ‖
నా తండ్రివై నా తోడుగా నిలచి
నా భారములన్ని తొలగించితివే‖ 2x ‖
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు‖ 2x క్షణమైన ‖