Verse
క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా
క్షణికమైన సుఖమురా ఇది‖ 2x ‖
ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా
సృష్టికర్తను స్మరణ చేయుమా
దైవ ప్రేమను మదిని నిలుపుమా
ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా‖ క్షణికమైన ‖
Verse
ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు‖ 2x ‖
ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా‖ 2x ‖
ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా‖ 2x ఓ స్నేహితుడా ‖
Verse
గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు‖ 2x ‖
ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును‖ 2x ‖
ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము‖ 2x ఓ స్నేహితుడా ‖