Chorus
కుమారి ఆలకించు - నీ వాలోచించి
కుమారి చెవియొగ్గుము
Verse
మరువుము నీదు స్వంత జనమును
మరువుము నీదు తండ్రి యింటిని
Verse
ఈ రాజు నీ ప్రభువు - నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు
ఈ రాజు నీదు సౌందర్యమును గోరె - ఈ రాజునకు నమస్కరించుము
Verse
తూరు దేశ కుమార్తె - నైవేద్యములను తీసికొని వచ్చును
ప్రజలలో ఇశ్వర్యవంతులు - కుమారి నీ దయను వెదకెదరు
Verse
అంతఃపురములో నుండు రాజకుమార్తె - ఎంతో మహిమ గలది
శృంగారమైనట్టి ఆమె వస్త్రములు - బంగారుబుట్టా పనిచేసినవి
Verse
విచిత్ర పనిగల వస్త్రముల ధరించి - విచిత్ర పనిగల
రాజు నొద్ధకు కన్యకల వలన - రమ్యముగా కొని రాబడుచున్నది
Verse
ఉత్సాహ సంతోషముతో - వారు వచ్చు చున్నారు - ఉత్సాహ సంతోషముతో
రాజనగరిలో ప్రవేశించు చున్నారు - రాబడు చున్నారు కన్యలందరు
Verse
నీ తండ్రులకు ప్రతిగా - నీ కుమారులుందురు - నీ తండ్రులకు ప్రతిగా
ఈ ధరణి యందంతట నీవు వారిని - అధికారులనుగా నియమించెదవు
Verse
తరము లన్నిటను నీ - పేరు జ్ఞాపకముండు - కరణి నొనర్చెదవు
కాన జనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించెదరు