Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kummaree O Kummaree Jagaduthpatthidha

కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిద

Kummaree O Kummaree Jagaduthpatthidha

Verse
కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిదారీ
జిగటమన్నై నా వంక చల్లగ చూడుమయ్యా......
Verse
పనికిరాని పాత్రనని పారవేయకుమా పొంగిపొరలు
పాత్రగా జేసి నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ
శ్రీ యేసున్ పొగడుచుండ సాక్షిగ నుండు
పాత్రగజేసి సత్యముతో నింపుము తండ్రి‖ కుమ్మరీ ‖
Verse
విలువలేని పాత్రన్ నేను కొనువారు లెరెవ్వరూ
వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగజేసి
ఆటంకములనుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా‖ కుమ్మరీ ‖
Verse
లోకాశతో నింజి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్
మనుష్యేచ్చలన్నియున్ స్థిరమనుచు నే మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నను పట్టితీ
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ నే పట్టితిన్‖ కుమ్మరీ ‖

Related Tags

SurrenderPotterDevotion