Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kummari Chethilo

కుమ్మరి చేతిలో

Kummari Chethilo

Verse
కుమ్మరి చేతిలో మంటి వలె
తల్లి ఒడిలో పసి బిడ్డ వలె‖ 2x ‖
అయ్యా నీ కృపతో నన్ను మార్చుము
యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము‖ కుమ్మరి ‖
Verse
నాలోని స్వయమును నలుగ గొట్టుము
నాలోని వంకరలు సక్కగా చేయుము‖ 2x ‖
నీ పోలిక వచ్చే వరకు
నా చేయి విడువకు‖ 2x ‖
సారె పైనుండి తీసివేయకు‖ 2x కుమ్మరి ‖
Verse
నాలోని అహమును పారద్రోలుము
నాలోని తొందరలు తీసి వేయుము‖ 2x ‖
నీ భుజముపై ఆనుకొనే
బిడ్డగా మార్చుము‖ 2x ‖
నీ చేతితో నడిపించుము‖ 2x కుమ్మరి ‖

Related Tags

WorshipRepentanceSurrender