Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kummari O Kummari

కుమ్మరి ఓ కుమ్మరి

Kummari O Kummari

Lyricist: Andhra Kraisthava Keerthanalu
Verse
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
Verse
పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా‖ 2x ‖
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి‖ కుమ్మరి ‖
Verse
విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి‖ 2x ‖
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా‖ కుమ్మరి ‖
Verse
లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని‖ 2x ‖
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్‖ కుమ్మరి ‖

Related Tags

WorshipRepentancePotter