Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kummarinchumu Nee Aatmanu Naapai

కుమ్మరించుము నీ ఆత్మను నాపై

Kummarinchumu Nee Aatmanu Naapai

Verse
కుమ్మరించుము నీ ఆత్మను నాపై నీకై జీవింతును
కృపనీయుము నీ యందు నిలచి నీకై ఫలియింతును
నన్ను కొన్న నా యజమానుడవే
అద్వితీయుడవు నీవే
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
Verse
పరిశోధకుడవు పరిపూర్ణతను ఇచ్చువాడవు నీవు
సత్యవంతుడవు బలమైన దుర్గమై నాతోడై నిలిచావు
నా కొరకై నీ ప్రాణమును క్రయధనముగ అర్పించినావు
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
Verse
పరలోకమును భూలోకమును ఏలువాడవు నీవు
మహిమతో నిండిన తేజోమయుడా వెలుగైన సర్వోన్నతుడా
శాశ్వతమైన నీ కృపను ధ్వజముగ నాపై నిలిపావు
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
Verse
ప్రతి స్థలమందున ప్రతి సమయమున నీ స్తుతినే పాడెదను
పరిశుద్ధాత్మతో అగ్నితోను నీలో హర్షింతును
నీ సాక్షిగ ఇల జీవింతును నా అతిశయము నీవే ప్రభు
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య

Related Tags

WorshipSurrenderHoly Spirit