Verse
కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో‖ 2x కుతూహలం ‖
Verse
పాపమంత పోయెను – రోగమంత పోయెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో‖ 2x కుతూహలం ‖
Verse
దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు
దేవాలయం మనమే
ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను
ఆశ్చర్యమాశ్చర్యమే‖ 2x కుతూహలం ‖
Verse
శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు
జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి
ఊరంతా చాటెదము‖ 2x కుతూహలం ‖