Verse
కుతూహల మార్భాటమే - నా యేసుని సన్నిధిలో
ఆనంద మానందమే - నా యేసుని సన్నిధిలో
Verse
పాపమంత పోయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం - కృప ద్వార రక్షణ పరిశుద్ధాత్మలో‖ 2x ‖
Verse
దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయం నేనే
ఆత్మలోన దేవుడు - గుర్తించె నన్ను అద్భుత మద్భుతమే‖ 2x ‖
Verse
శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును
ఏకముగా కూడి, హోసన్న పాడి - ఊరంత చాటెదము‖ 2x ‖
Verse
భూరధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండె
ఒక్క క్షణములోనె, రూపాంతరము పొంది - మహిమలో ప్రవేశిద్దాం‖ 2x ‖