Chorus
లాలి లాలి లాలమ్మ లాలి - లాలనుచు బాడరే బాల యేసునకు‖ లాలి ‖
Verse
పరలోకపు దేవ తనయుడోయమ్మా - పుడమిపై బాలుడుగ పుట్టెనోయమ్మా‖ లాలి ‖
Verse
ఇహ పరాదుల కర్త యితడేనొ యమ్మా - మహిబాలనము జేయు మహితుడోయమ్మా‖ లాలి ‖
Verse
ఆదియంతము లేని యనఘుడో యమ్మా - ఆదాము దోషమున కడ్డుపడె నమ్మా‖ లాలి ‖
Verse
యూదులకు రాజుగా బుట్టెనోయమ్మా - యూదు లాతని తోడ వాదించిరమ్మా‖ లాలి ‖
Verse
నర గొర్రెల మంద కాపరో యమ్మా - గొర్రెలకు నందంబు క్రీస్తు తానమ్మా‖ లాలి ‖