Chorus
లాలి లాలి లాలి లాలమ్మ లాలీ
లాలియని పాడరే బాలయేసునకు
Verse
పరలోక దేవుని తనయుడో యమ్మా
పుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా
Verse
ఇహ పరాదుల కర్త యీతడో యమ్మ
మహి పాలనము జేయు మహితుడో యమ్మా
Verse
ఆద్యంతములు లేని దేవుడో యమ్మా
ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా
Verse
యూదులకు రాజుగాబుట్టెనో యమ్మా
యూదు లాతని తోడ వాదించి రమ్మా
Verse
నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా
గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా