Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Laalilaali Laali Laalamma Laalee Laali

లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలి

Laalilaali Laali Laalamma Laalee Laali

Lyricist: Thirukovalluri Steven
Chorus
లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు‖ లాలి ‖
Verse
పరలోక దేవుని తనయుఁడో యమ్మా పుడమిపై బాలుఁడుఁగఁ బుట్టెనో
యమ్మా లాలి‖ లాలి లాలి ‖
Verse
ఇహ పరాదుల కర్త యీతఁడో యమ్మ మహి పాలనముఁ జేయు
మహితుఁడో యమ్మా లాలి‖ లాలి లాలి ‖
Verse
ఆద్యంతములు లేని దేవుఁడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడె
నమ్మా లాలి‖ లాలి లాలి ‖
Verse
యూదులకు రాజుగాఁబుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి
రమ్మా లాలి‖ లాలి లాలి ‖
Verse
నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా లాలి‖ లాలి ‖

Related Tags

ChristmasLullaby