Chorus
లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు
లేచినాడురా సమాధి గెలిచినాడురా
Pre-Chorus
లేతునని తా జెప్పినట్లు - లేఖనములో పలికినట్లు
Verse
భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న
Verse
ప్రభువు దూత పరము నుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి
భళిర దాని పై కూర్చుండె - భయము నొంద కావలివారు
Verse
ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధమును
శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ
Verse
చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ
లేడు గలిలయ ముందుగ పోతున్నాడు అపుడే లేచినాడని
Verse
చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు
Verse
నేను చేసె పనుల నెరుగు - నేను నడిచె మార్గ మెరుగు
నేను చెప్పు మాట లెరుగు - నేను బ్రతికె బ్రతుకు నెరుగు
Verse
నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకొందు
తాను నాలో యుండినందున - దయను జేర్చును మోక్షమందు
Verse
పాప భారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు
నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభున్
Verse
యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవం
యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం
Verse
పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడు
పాపులను ప్రేమించినాడు - ప్రాణదానము చేసినాడు