Chorus
లేచు దినము వచ్చును మృతు లెల్ల నికఁ లేచు దినము వచ్చును వేచి
యిల నున్నట్టి విమలు లెల్ల నడుపు లేచి ప్రభుని నెదురు కొందు
రానందముతో‖ లేచు ‖
Verse
యేసు మేఘారూఢూండై యిలకు దిగ వాసిగ దూత లపుడు
భాసురంబుగ బాకా పై నినాదము సేయ గ సమాధుల నిద్రగాంచు
జనులెల్లరు‖ లేచు ‖
Verse
కడబూర ధ్వని సేయఁగ మడిసిన వారు తడవు సేయక లేతురు
ఎడతెగక ప్రభు నొద్దఁ గడు సంతసంబుతో విడువక యుందు రా
విమల లోకమునందు‖ లేచు ‖
Verse
ఘన మహిమన్ బ్రభువు రాఁగన్ గడలి యపుడు తన యందుండెడి
శవములన్ ఘనముగఁ గాననము దనయందుండెడు మృతులన్
వినయంబుతో దెచ్చి విభుని కప్పగింప‖ లేచు ‖
Verse
అరయంగ నీతపరు లా నందమున న క్షర దేహులై వెలయుచున్ జిరత
రానందంబు బరలోకమున నెపుడు స్ఫురిత జీవను లగుచుఁ బరమ
సుఖ మొందుదురు‖ లేచు ‖
Verse
కరుణ లేని సమాధీ నిరతము నన్నుఁ జెరపట్టి యుంచగలవే వరదుండు
క్రీస్తుండు వర దూత సేనలతోఁ బరివేష్టితుఁడై యదిగో నరుదెంచుచున్నాఁ
డు‖ లేచు ‖
Verse
మరణమా నీ ముల్లేది నరులను నింక వెఱపించు చుండగలవే
మరణ సంహారుండు మహిమతో నరుదేరన్ మరణం బడుగుబడి య
మర త్వంబిఁక నుండున్‖ లేచు ‖
Verse
మరణంబు నొందలేదా ప్రభు యేసు నీ చెఱయందు నుండలేదా
పరమేశు తనయుండు మరణ సమాధులన్ పరిపూర్ణముగ గెల్చి చెఱను
జెరగపట్టెను‖ లేచు ‖
Verse
మంగళములు పాడరే క్రీస్తుకు జయ మంగళములు పాడరే
మంగళములు పాడి మంగళ ప్రదుఁడైన శృంగార రాజునకు
సంగీతంబులతోడ మంగళములు పాడరే‖ లేచు ‖