Verse
లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని‖ లేలెమ్ము ‖
Verse
విడువకు యుద్ధము నుడువకబద్ధము యొడయుఁడు నీకడ నుండును
బాయఁడు‖ లేలెమ్ము ‖
Verse
విడువకు ధైర్యము వదలకు కవచము సదయుఁడు క్రీస్తుఁడు సత్ఫల
మిచ్చును‖ లేలెమ్ము ‖
Verse
బెదరకు మేరికి వదలకు దారిని నది యిది కానిది యాత్మను బెట్టక‖ లేలెమ్ము ‖
Verse
ప్రార్థన సారము వర్ధిలఁ గోరుము సార్థక కాలము వ్యర్థము చేయక‖ లేలెమ్ము ‖
Verse
భావములోనన్ దేవుని ప్రేమన్ నీవది వేఁడుచు నెమ్మదిఁ గూడుచు‖ లేలెమ్ము ‖
Verse
యేసుని సిలువ నెదుట బెట్టుకో మోసము నొందవు యేసుని కాపున‖ లేలెమ్ము ‖