Verse 1
Reference: నిద్రించుచున్న నీవు మేల్కొనుము ఎఫెసీయులకు Ephesians 5:14
Chorus
లేలెమ్ము సోదరీ సోదరుడా - వేళాయె యేసుని సేవింపను
Verse
నిదుర మేల్కొనెడి వేళాయెను
నిద్రించిన శత్రు విజృంభించున్
భద్రము మేల్కొని సేవింపుము
Verse
కీడు లెన్నో చేసి చెడిపోతిమి
పాడెను ముట్టిన యేసు ప్రభు
నీడవలె అంటి వెంటాడెను
Verse
దేవునికే యిల లోబడుచు
కావించుము పనులు యేసునకై
సేవించుము ప్రభుని చిత్తముతో
Verse
ఏల ముఖము లింక నేల మోపి
కాల యాపన చే-తురెందుకయ్యో
కాలవిలువ నెరిగి సాగిరండి
Verse
సాగిపోవుడంచు సెలవిచ్చెను
ఆగిపోవుట యేల సోదరుడా
సాగరము చూడు పాయలాయె
Verse
నేనే భయ-పడకుడనెను
తన వాగ్దానములన్ని నెరవేర్చెను
కను పాపవలె మనల కాపాడెను
Verse
పరిశుధ్ధ పిల్పులో పాల్పొందిన
పరిశుధ్ధ సోదరి సోదరుడా!
పరిశుధ్ధ డేసుపై లక్ష్యముంచి
Verse
హల్లెలూయ పల్లవిని పాడుచు
యెల్లజనుల కిలలో చాటెదము
వల్లభుండు యేసు వచ్చుచుండె