Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Laelemmu Sodari Sodaruda Rakshkudaesuni Saevimp

లేలెమ్ము సోదరీ సోదరుడా రక్షకుడేసుని సేవింప

Laelemmu Sodari Sodaruda Rakshkudaesuni Saevimp

Verse
లేలెమ్ము సోదరీ సోదరుడా - రక్షకుడేసుని సేవింప
Verse
సత్యముతో ఆత్మతో దేవుని - సన్నిధి జేరి ఆరాధింప
ఆశ్చర్యకరుడు ఆలోచన - కర్త బలవంతుడు ప్రభుయేసు
Verse
రాజాధిరాజు మన ప్రభుయేసు - రాజ్యము నీయ మనకై వచ్చున్
రాజైన యేసు విజయము కల్గి - విజయుండు యేసుని చాటెదము
Verse
షద్రకు మేషాక బెద్నాగో - పౌరుషముతోడ ప్రభుశ్రమ నోర్చె
కరువైనను మీకు శ్రమలైన - కరుణించుచు ప్రభు మీతో నడుచున్
Verse
స్తెఫెనాది అపొస్తలులంత - అపవిత్రమైన ప్రజలమధ్య
కృపాళుదైన యేసుని చాటె - కృపనొందుచు ప్రభుని చాటండి
Verse
అర్పించుడి మీదు హృదయములన్ - నెరవేర్చను దేవుని చిత్తమును
కర్తను సేవింపగను లెండి - వీరులుగా దావీదు వలెను
Verse
యౌవనేచ్ఛలను విసర్జించి - యౌవన రక్తముతో మిము గొన్న
పావనుడగు యేసు ప్రభువునకై - చావను వెనుదీయక రారండి
Verse
జీవించువాడనే కానంచు - జీవించుట ప్రభు కొరకే యంచు
గావించుము ప్రభు పనులిలలోన - జీవించు ప్రభు కొరకే యిలలో

Related Tags

WorshipDevotionService