Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Le Nilabadu Parugidu Thandri Panikosame

లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే

Le Nilabadu Parugidu Thandri Panikosame

Verse
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా
పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే.. నదిలా.. ఎదురుగ నిలబడు అలలకు జడియకు‖ లే నిలబడు ‖
Verse
రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం‖ లే నిలబడు ‖
Verse
సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన
చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం‖ లే నిలబడు ‖

Related Tags

EvangelismServiceCourage