Chorus
లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని లేచి స్తుతింపఁ బూనుఁడి
లేచి స్తుతించెదము చూచుచు మనలను బ్రోచి ప్రేమతోఁ గరము జాచి
కాపాడు విభుని‖ లేచి ‖
Verse
రాత్రి జాముల యందున రంజిలఁదన నేత్రము తెరచినందున
మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసఁబ విత్ర
గీతము పాడుచు‖ లేచి ‖
Verse
నిదురఁభోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను
ముదముతో నిదురఁబొంది యుదయాన లేచితిమి సదయుఁడైన క్రీస్తు
పదముల దరిఁజేర‖ లేచి ‖
Verse
నిగమ వేద్యుఁడు మనలనుఁ దనలోన నీ పగలు కాపాడఁబూనెను
దిగులు బొందక పనులు తెగువతోఁ జరుపుకొనుచు వగపుతో లేచి
మ్రొక్కి మిగుల శుద్ధాత్మనడిగి‖ లేచి ‖
Verse
నేటి పాఠములయందు నిర్భయముగ దాటివెలసి యుందు సూటిగ
నీదు ఱెక్కల చాటుగను నిలుపు మనుచు నీటుగా నెల్లవార నిత్యము
ప్రేమనేల‖ లేచి ‖