Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lechinaadayyaa

లేచినాడయ్యా

Lechinaadayyaa

Verse
లేచినాడయ్యా
మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా‖ 2x ‖
పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు
మహిమా స్వరూపుడై లేచినాడయ్యా
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై‖ 2x ‖
క్రీస్తు లేచెను హల్లెలూయా
సాతాను ఓడెను హల్లేలూయా
క్రీస్తు లేచెను హల్లెలూయా
మరణాన్ని గెలిచెను హల్లేలూయా‖ లేచినాడయ్యా ‖
Verse
శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను‖ 2x ‖
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై‖ 2x క్రీస్తు ‖
Verse
జీవ మార్గము మనకు అనుగ్రహించెను
మన పాపములన్ని తుడిచివేసెను‖ 2x ‖
ప్రేమయై మనకు జీవమై
వెలుగునై మంచి కాపరియై‖ 2x క్రీస్తు ‖

Related Tags

PraiseResurrectionEaster