Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lechinaaduraa

లేచినాడురా

Lechinaaduraa

Verse
లేచినాడురా
సమాధి గెలచినాడురా‖ 2x ‖
యేసు
లేతునని తా చెప్పినట్లు‖ 2x ‖
లేఖనములలో పలికినట్లు‖ లేచినాడురా ‖
Verse
భద్రముగా సమాధిపైన
పెద్ద రాతిని ఉంచిరి భటులు‖ 2x ‖
ముద్ర వేసి రాత్రి అంతా‖ 2x ‖
నిద్ర లేక కావలియుండ‖ లేచినాడురా ‖
Verse
పాప భారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు‖ 2x ‖
నరక బాధ లేదు మనకు‖ 2x ‖
పరమ తండ్రి యేసు ప్రభువు‖ లేచినాడురా ‖
Verse
యేసునందే రక్షణ భాగ్యం
యేసునందే నిత్య జీవం‖ 2x ‖
యేసునందే ఆత్మ శాంతి‖ 2x ‖
యేసునందే మోక్ష భాగ్యం‖ లేచినాడురా ‖
Verse
పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించినాడు‖ 2x ‖
పాపులను ప్రేమించినాడు‖ 2x ‖
ప్రాణ దానము చేసినాడు‖ లేచినాడురా ‖

Related Tags

JesusResurrectionEaster